Sabitha Indra Reddy Gives Counter To AP Minister Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు. బొత్స వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని.. వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపెంత స్థాయి మీకు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థపై చర్చించేందుకు మీరు సిద్దమా? అని సవాల్ విసిరారు. విద్యావ్యవస్థలో తాము చేసిందేమిటో, మీరు ఉద్ధరించిందేమి తేల్చుకునేందుకు చర్చిద్దామా? అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుంచి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఏపీ నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు.
Minister KTR: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ బహిరంగ లేఖ
2015, 2018లో తెలంగాణలో టీచర్స్ బదిలీలు జరిగాయని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్సకు మంత్రి సబితా సూచించారు. ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, తప్పుగా మాట్లాడొద్దని హితవు పలికారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణ విద్యావ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ఐఐటీ, మెడికల్, ఇంజరింగ్‌లో విద్యార్థులు సాధించిన ఫలితాలు మీకు కనబడటం లేదా? అని బొత్సని నిలదీశారు. గురుకులాలతో ఒక్కో విద్యార్థిపై రూ.1 లక్ష 20 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. మీ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని అడిగారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాత్రం రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీలో అవకతవకలు జరిగితే.. సిట్‌తో పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని మంత్రి సబితా చెప్పుకొచ్చారు.
Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
కాగా.. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్‌సీలో చూచిరాతలు, స్కాంలు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. కొంతమంది మాట్లాడితే తెలంగాణ పేరు ఎత్తుతున్నారని.. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో రోజు పేపర్లో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే సక్రమంగా నిర్వహించలేని దుస్థితి తెలంగాణలో ఉందని.. ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం వారి టీచర్లను బదిలీలు చేసుకోలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సబితా పై విధంగా చురకలంటించారు.