బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ఆమె విద్యార్థులను కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వీసీకి సమాచారం అందించాలని తెలిపారు. రెండేళ్ల నుంచి యూనివర్సిటీ, స్కూళ్లు సరిగా నడవలేదని.. రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తాయని..త్వరలోనే ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు.
విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని..చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని సబిత అన్నారు. చిన్న చిన్న రిపేర్ లు కూడా పెద్ద సమస్యలు అని మెన్షన్ చేశారు, అవన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దయచేసి విద్యా దగ్గర రాజకీయాలు చెయ్యకండని.. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని ఆమె నేతలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మంత్రికి చెప్పాలని అనవసరంగా ఆందోళన చేయవద్దని ఆమె సూచించారు. ఇంచార్జ్ వీసీ, కాంట్రాక్ట్ లెక్చలర్లు ఉంటే విద్యార్థులకు ఏం సమస్య అని ప్రశ్నించారు. వారికి మెరుగైన విద్య అందించాలని.. రేపటి నుంచి క్లాసులకు అటెండ్ కావాలని ఆమె విద్యార్థులకు సూచించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని. అందరికీ నాణ్యమైన విద్య అదిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చిన్నచిన్న సమస్యలపై విద్యార్థులు ఆందోళన చెేయవద్దని, విరమించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీని పర్సన్ గా విజిట్ చేస్తారని ఆయన వెల్లడించారు. జూలై మొదటి వారంలో విద్యాశాఖ మంత్రి విజిట్ ఉంటుందని ఆయన అన్నారు.