Telangana Rtc: మళ్ళీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ప్రయాణికులు కస్సు..బస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రయాణికుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో ప్రయాణికులపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెలుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి.
ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రయాణికులకు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read
- Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు,రూట్ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు.
అయితే బస్సు చార్జీలకన్నా ఆటో చార్జీలే నయం అంటూ ప్రయాణికులు అంటున్నారు. కొంతదూరంలో వున్నా ఆర్టీసీ టికెట్ ధరలు 30 నుంచి 45 వుంటున్నాయని సమాచారం. కాగా.. అదే ఆటో చార్జీలైతే 25 నుంచి వసూలు చేస్తున్నాని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణాలకు ఇబ్బంది కలిగించకుండా ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?