మాయావతి కీలక ప్రకటన.. బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.. ఆయన వీఆర్ఎస్ తీసుకన్న తర్వాత.. టీఆర్ఎస్లో చేరతారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి రాగానే వాటిని ఖండించారు.. ఇక, ఆ తర్వాత ఆర్ఎస్పీ.. బీఎస్పీవైపు అడుగులు వేస్తున్నారని.. ఆ పార్టీలో చేరి.. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారనే చర్చసాగింది.. ఆ వార్తలను నిజమేనని తేలిపోయింది.. తాజాగా మీడియాతోమాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాన్షీరాం అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని.. త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని ప్రకటించారు.
దీంతో.. బీఎస్పీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గ్నీన్ సిగ్నల్ వచ్చినట్టు అయ్యింది.. కాగా, బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తిగా ఉన్నట్లు అప్పటి నుంచి టాక్ నడుస్తోంది… గత నెలలో ఆయన యూపీకి వెళ్లి బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అప్పటికే జై భీమ్… జై భారత్ నినాదంతో ఉన్న ఆయన పలు సందర్భాల్లో బహుజనవాదం కూడా వినిపించారు. బీఎస్పీలో చేరుతారనే ప్రచారం ఉండగా.. మాయావతి తాజాగా చేసిన ప్రకటనతో అది తేలిపోయింది.. వంద శాతం పేదల పక్షాన ఉండాలనుకుంటున్నాను. అందుకే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాను. అనేక శాఖల్లో పని చేశాను. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉంది. నా సర్వీసులో కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందించాను. వందశాతం పేదల పక్షాల ఉండాలనే రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!