Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Records: వెస్టిండీస్‌తో రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత బౌలర్లు, ఫీల్డర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 252 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఓ అనవసరపు రికార్డు నమోదయ్యింది.
అరుదైన చెత్త రికార్డు
టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ 240కి పైగా పరుగులు చేసినప్పటికీ.. మూడు సందర్భాల్లో జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచినట్లు నివేదిక పేర్కొంది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా 2024లో 261 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 245 పరుగుల లక్ష్యాన్ని కూడా ప్రత్యర్థి ఛేదించింది. ఇప్పుడు భారత జట్టు 249 పరుగులు చేసినా ఓడిపోవడంతో ఈ జాబితాలో మరోసారి అయ్యర్ పేరు చేరింది.
Also Read
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
- Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
- Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
టీమిండియా ఖాతాలోనూ
రాంచీలో ఎదురైన ఓటమి భారత టీ20 అంతర్జాతీయ క్రికెట్ గణాంకాల్లోనూ ప్రత్యేకంగా నిలిచింది. టీ20 చరిత్రలో తొలిసారిగా 225కి పైగా పరుగులు చేసిన తర్వాత భారత్ ఓటమి చెందింది. అంతేకాకుండా.. స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తొలిసారిగా 250కి పైగా పరుగులు సంపర్పించుకుంది. భారీ స్కోరు సాధించినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వైఫల్యం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.
అయ్యర్ కెప్టెన్సీలో ప్రతికూల రికార్డులు?
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత టీ20 జట్టు ప్రదర్శనకు సంబంధించి పలు ప్రతికూల గణాంకాలను ఈ కథనం ప్రస్తావించింది. ఐర్లాండ్‌పై అంతర్జాతీయ మ్యాచ్, సిరీస్‌లో తొలిసారి ఓటమి ఎదుర్కోవడం, వరుసగా ఐదు, ఆరు, ఏడు టీ20ఐ మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోవడం వంటి అంశాలను పేర్కొంది.
వీటితోపాటు టీ20ఐల్లో తొలిసారిగా 100కు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం, 125 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలవడం, 76 పరుగులకే ఆలౌట్ కావడం వంటి ప్రతికూల ఫలితాలు నమోదైనట్లు కథనం తెలిపింది. 1,605 రోజుల పాటు కొనసాగిన టీ20ఐ నంబర్ 1 ర్యాంకును కోల్పోవడం, ఇంగ్లండ్‌తో 12 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్ ఓడిపోవడం, ఏడేళ్ల తర్వాత వరుసగా రెండు టీ20 సిరీస్‌లను కోల్పోవడం వంటి పరిణామాలను కూడా ప్రస్తావించింది.
భారత జట్టు గత ప్రదర్శనతో పోలిస్తే.. ఇటీవలి ఫలితాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తున్నట్లు కథనం పేర్కొంది. 2024 జనవరి నుంచి 2026 మే మధ్య భారత్ 61 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. అయితే.. ఆ తర్వాతి నాలుగు నెలల్లోనే 18 మ్యాచ్‌లు ఆడి 7 పరాజయాలను ఎదురుకుంది
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్