Sova virus: బ్యాంకింగ్ యాప్స్‌కు ‘సోవా’ ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sova virus: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. అలాగే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్‌లోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా హ్యకర్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ వైరస్‌ల లింకులను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది. దేశీయ బ్యాంకు యాప్స్ ను టార్గెట్ చేస్తున్న సరికొత్త వైరస్ గురించి పలు బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేశాయి. సోవా అనే ఈ వైరస్ బ్యాంకు యాప్స్ లోకి చొచ్చుకొని పోయి మీ సమాచారంతో పాటు ఆస్తులను కూడా తస్కరించగలదని ఎస్బీఐ, పీఎన్బీ, కెనెరా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. మొబైల్ లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నమ్మకమైన సోర్సు నుంచే చేసుకోవాలని సూచిస్తున్నాయి.
ఏంటీ సోవా వైరస్?
ఎస్బీఐ ట్వీట్ ప్రకారం సోవా(SOVA) అనేది ఒక ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది బ్యాంకు యాప్స్ లోకి జొరబడి పర్సనల్ సమాచారం తస్కరిస్తుంది. అంతేకాకుండా యూజర్ల పర్సనల్ క్రెడెన్షియల్స్ ను కూడా గ్రహించి వారి అకౌంట్లలోకి యాక్సెస్ పొందుతుంది. ఒకసారి ఈ వైరస్ వస్తే దాన్ని అన్ ఇన్స్టాల్ చేయడం అసాధ్యమవుతుంది. అందుకే ముందుగానే ఇది ఎంటరవకుండా చర్యలు తీసుకోవాలి. పీఎన్బీ హెచ్చరిక ప్రకారం ఈ వైరస్ ఎస్ఎంఎస్ ఫిషింగ్ రూపంలో ఎంటరై అటాక్ చేస్తుంది. ఒకసారి మొబైల్ లోకి ఎంటర్ అవగానే అందులోని యాప్స్ వివరాలను, వ్యక్తిగత వివరాలను కమాండ్ సెంటర్ (వైరస్ పంపిన వారు)కి పంపుతుంది. అటుపై కమాండ్ సెంటర్ ద్వారా సదరు మొబైల్ నియంత్రణ జరుగుతుంది.
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
Read Also: North Korea: జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం
ఏం చేయగలదు?
కీ స్ట్రోక్స్ కలెక్షన్, కుకీల తస్కరణ, ఎంఎఫ్ఏ టోకెన్లను అడ్డుకోవడం, స్క్రీన్ షాట్లు తీయగలగడం, వెబ్ కామ్ ద్వారా వీడియో రికార్డింగ్, స్క్రీన్ క్లిక్ లాంటి గెశ్చర్ల నియంత్రణ, కాపీ మరియు పేస్ట్, ఇతర బ్యాంకింగ్, పేమెంట్ యాప్స్ అనుకరణ లాంటి పలు చర్యలను ఈ వైరస్ నిర్వహిస్తుంది.
జాగ్రత్తలు ఇలా..
సోవా వైరస్ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంకులు కొన్ని సూచనలు చేస్తున్నాయి.
అవేమిటంటే.. సోర్స్ తెలియని యాప్స్ జోలికి పోకూడదు. యాప్ డౌన్లోడింగ్ కు ముందు దాని రివ్యూలు, రేటింగ్ తదితర వివరాలను పరిశీలించాలి. యాప్స్ కు ఇచ్చే అనుమతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన అనుమతులు మాత్రమే మంజూరు చేయాలి. ఎప్పటికప్పుడు యాప్స్ అప్ డేట్ చేయాలి. హానికారక వెబ్సైట్లను బ్రౌజ్ చేయవద్దు, అవి పంపే లింకులను క్లిక్ చేయవద్దు. సరైన యాంటీ వైరస్ ను ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోవద్దు. తెలియని మెయిల్స్, ఎస్ఎంఎస్ లను ఓపెన్ చేయవద్దు. చేసినా వాటిలో లింకులను క్లిక్ చేయవద్దు. ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ మీకు తోచినట్లైతే వెంటనే బ్యాంకుకు పూర్తి వివరాలతో సమాచారం అందించండి.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!