Revanth Reddy: ప్రగతిభవన్‌పై రేవంత్ కామెంట్స్.. బీఆర్ఎస్ నేతలు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ములుగులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ నమోదుచేయాలని ములుగు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేసారు. రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి యాత్రపై ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డి కామెంట్స్ పైనా బీఆర్ఎస్ శ్రేణులు పిర్యాదు చేయగా ఇక నర్సంపేట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రెడీ అయ్యారు.
Read also: Revanth Reddy Padayatra: రేవంత్ పాదయాత్ర.. ఈరోజు షెడ్యూల్ ఇదీ..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేయాలని నిన్నటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది… అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో 120 గదుల ప్రగతి భవన్ ను హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ నిర్మించాడని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం ఉండదని తెలిపారు. ఆంధ్ర పెట్టుబడిదారీలకు మాత్రమే ప్రగతి భవన్ లోకి ప్రవేశం ఉంటుందన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఈ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఓ సన్యాసి, డ్రామారావు అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తం మా కుటుంబమే అంటున్నా సన్యాసి అని, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు డ్రామారావు అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో చదువుకుంది గుంటూర్ లో, చిప్పలు కడిగింది అమెరికాలో అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉద్యమకారులను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
Telangana Budget: నేడు ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ.. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!