Revanth Reddy Padayatra: రేవంత్ పాదయాత్ర.. ఈరోజు షెడ్యూల్ ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Padayatra: హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇవాల్టితో మూడో రోజులకు చేరుకుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం రేవంత్ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈదులపూసపల్లి గ్రామంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత రైతులతో మాట ముచ్చట కొనసాగనుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఈదులపూసపల్లి నుండి మహబూబాబాద్ పట్టణానికి పాదయాత్ర కొనసాగనుంది. మహబూబాబాద్ పట్టణంలో పలు సెంటర్ల మీదిగా ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకోనుంది. తొర్రురు బస్టాండ్ వద్ద బహిరంగసభలో రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి పెద్దవంగర వద్ద బస చేయనున్న రేవంత్.
Read also: Telangana Budget: నేడు ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ.. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం
Also Read
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేయాలని నిన్నటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది… అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో 120 గదుల ప్రగతి భవన్ ను హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ నిర్మించాడని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం ఉండదని తెలిపారు. ఆంధ్ర పెట్టుబడిదారీలకు మాత్రమే ప్రగతి భవన్ లోకి ప్రవేశం ఉంటుందన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఈ సంచలన కామెంట్స్ చేశారు.
Astrology: ఫిబ్రవరి 08, బుధవారం దినఫలాలు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!