Revanth Reddy’s letter to CM KCR About compensation for martyrs: బీహార్ రాష్ట్రంలో గల్వాన్ లోయ అమర వీరులకు తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారు. అయితే దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెడుతున్నారని కేసీఆర్ తీరును విమర్శించారు. తెలంగాణ ప్రజల చెమట, రక్త, కష్టార్జితం నుంచి కట్టిన పన్నుల సొమ్మును.. అత్త సొమ్ముడు అల్లుడు దాని చేసినట్లు ఉందని విమర్శించారు. మీరు దేశం అంతా తిరిగి పప్పుబెల్లాలుగా పంచుతున్నారని విమర్శించారు.
అమర జవాన్లు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వారి త్యాగం పట్ల, వారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందని…ఐతే ఇంట్లో ఈగట మోత, బయట పల్లకిల మోత తీరుగా ఉన్న కేసీఆర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేరొన్నారు. గల్వాన్ లోయలో అమరవీరులకు పరిహారం అందచేసిన మీ పర్యటనలో జవాన్ల కుటుంబాల సానుభూతి కన్నా.. మీ రాజకీయ, రాజ్యధికార విస్తరణ కాంక్షే ఎక్కువగా కనబడుతుందని దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని మీరు ఉవ్విళ్లూరుతున్నారని.. అందుకే ఈ కార్యక్రమం చేపట్టారనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
Read Also: Fake Finger Prints: నయామోసం.. నకిలీ వేలిముద్రల సర్జరీ
నిజంగా అమరవీరుల జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం మీకు కనిపించలేదని ప్రశ్నించారు. యాదయ్య త్యాగం మీకు యాదికి రాలేదా..? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కాశ్మీర్ లో 2013లో ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మీ పార్టీ తరుపున మీ కుమార్తె కవిత వెళ్లి పరామర్శించి.. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ఆ హామీకి అతీగతీ లేదని విమర్శించారు.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ రాష్ట్రంలోని అమరవీరులకు పరిహారం ఇవ్వడం పరిహాసంగా అనిపించడం లేదా.. అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇదేనా అమరవీరుల కుటుంబాల పట్ల మీకున్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. వెంటనే ఆ కుటుంబానికి ఇచ్చిన హామీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.