CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- కేసీఆర్ పాలనపై రూ.8 లక్షల కోట్ల అప్పుల ఆరోపణలు
- కాళేశ్వరం అవినీతిపై హరీష్‌కు ప్రశ్నలు
- నీటి వాటాలపై బీఆర్ఎస్ నేతలకు సవాల్
- అసెంబ్లీకి వస్తే అన్నీ బయటపెడతానన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై నిప్పులు చెరిగారు. దొరల పాలన రావాలని, ప్రజా పాలన పోవాలని కొందరు మాట్లాడుతున్నారని విమర్శిస్తూ.. పదేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదులుతున్నారని తనపై విమర్శలు చేస్తున్నారని, అయితే తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా రాష్ట్ర హక్కుల కోసం తాను ఎప్పుడూ పోరాడతానని స్పష్టం చేశారు. 2017లోనే చంద్రబాబుతో విడిపోయి తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్నానని, నాలుగు కోట్ల ప్రజలు చిన్న వయసులో ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణకు అన్యాయం చేస్తానా అని ప్రశ్నించారు. అలాంటి ఆలోచన వచ్చినా తాను తెలంగాణ బిడ్డనే కాదని అన్నారు.
కాళేశ్వరం అవినీతి.. 2018 మంత్రి పదవిపై నిలదీత
హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. 2018లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకున్నందుకే మంత్రి పదవి నుంచి తొలగించారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పేరును కాళేశ్వరంగా మార్చి, అంచనాలు పెంచి రూ.38 కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. అవినీతి కారణంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం కూలిపోయిందని, కట్టినప్పుడు హరీష్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శించారు. అది కట్టుడు, కూలుడు రెండు అయిపోయాయని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను పిలిచి కాళేశ్వరంరావు అని పిలిపించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
Also Read
- Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
- CM Revanth Reddy : సిద్దిపేటలో కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
- Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
- Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
నీటి వాటాలు, ప్రాజెక్టులపై సవాల్
అసెంబ్లీకి వస్తే ఎవరు ఏం చేశారో బహిరంగంగా చర్చిద్దామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ ప్రగతి భవన్‌కు వచ్చినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై అంతర్గత ఒప్పందం చేసుకున్నారని, రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని ప్రాజెక్టులు అప్పజెప్పారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి 8 టీఎంసీల నీటిని రాజశేఖర్ రెడ్డి ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్ అదే మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ గెలిచినప్పుడు నిజాయితీ ఉంటే అప్పుడే తెలంగాణ వచ్చేదని, వలసలు కూడా ఆపలేదని అన్నారు. కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్ల బిల్లులు ఇచ్చారని, కానీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తయ్యేవని పేర్కొన్నారు.
అసెంబ్లీలో తేల్చుకుందామని హెచ్చరిక
తనతో పెట్టుకుంటే ఊరుకోనని, అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు విప్పుతానని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బావమరిది ఎవరితో పొత్తుల వ్యాపారం చేస్తున్నారో అసెంబ్లీ వేదికగా చెబుతానని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
-
Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
-
Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
-
Healthy Breakfast: ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్! 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!