CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- రూ.620 కోట్లతో సైదాబాద్ బ్రిడ్జి
- ‘ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’
- పాతబస్తీ అమ్మాయిలకు రూ.25 కోట్ల సాయం
- మిర్ ఆలం ట్యాంక్‌కు కొత్త లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. రూ.620 కోట్ల బడ్జెట్‌తో 3.24 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాతబస్తీ అభివృద్ధి, విద్య, దేశభక్తి, మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టి వదిలేసింది
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపన చేసి వెళ్లిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులను వేగవంతం చేసి రూ.620 కోట్లతో బ్రిడ్జిని పూర్తి చేశామని తెలిపారు.
Also Read
‘ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలతో హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పాతబస్తీని ‘ఓల్డ్ సిటీ’గా కాకుండా ‘ఒరిజినల్ సిటీ’గా తాను భావిస్తానని చెప్పారు. హైదరాబాద్‌కు పాతబస్తీ షాన్ అని పేర్కొన్నారు. నిజాం కాలంలో చార్మినార్ చుట్టూ దొరకని వస్తువంటూ ఉండేది కాదని, ప్రస్తుతం కొన్ని వస్తువుల కోసం దుబాయ్, లండన్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
అసద్ బాయ్ చెప్పిన పనులు వెంటనే చేయాలి
పాతబస్తీ అభివృద్ధికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఏం చెబితే అది వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
పాతబస్తీకి చెందిన అమ్మాయిలు ఉన్నత విద్య అభ్యసించి లాయర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని సీఎం ఆకాంక్షించారు. సలావుద్దీన్ సాబ్ తన కుమారుడు అసదుద్దీన్‌ను లండన్‌కు పంపించి బారిస్టర్ చదివించారని, అందుకే ఆయన దేశంలో కీలక నేతగా ఎదిగారని చెప్పారు.
విద్య కోసం మలక్‌పేట ఎమ్మెల్యే రూ.20 కోట్లు కోరారని, అయితే తాను రూ.25 కోట్లు మంజూరు చేస్తానని సీఎం ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. నిధులు మంజూరు చేయడం తన బాధ్యత అయితే, పిల్లలు చదువుకునేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని అన్నారు.
అసదుద్దీన్, అక్బరుద్దీన్ దేశభక్తులే
దేశభక్తి విషయంలో అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలను వేలెత్తి చూపే అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ జవాన్లకు మద్దతుగా అసదుద్దీన్ వేలాది మందితో నెక్లెస్ రోడ్‌కు వచ్చారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చని, కానీ దేశభక్తి విషయంలో అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వారిని దేశభక్తులుగా తాను చెబుతున్నానని స్పష్టం చేశారు.
మిర్ ఆలం ట్యాంక్‌పై 3 కి.మీ కేబుల్ బ్రిడ్జి
హైదరాబాద్‌లో పర్యాటక అభివృద్ధిపై కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. కేబుల్ బ్రిడ్జిని చూడాలంటే దుర్గం చెరువు, ఇతర పర్యాటక ప్రాంతాల కోసం ట్యాంక్‌బండ్‌కు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. అందుకే చారిత్రక మిర్ ఆలం ట్యాంక్‌ను అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మిర్ ఆలం ట్యాంక్‌పై ఏకంగా 3 కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ సుమారు 500 మీటర్ల కేబుల్ బ్రిడ్జి మాత్రమే ఉందని చెప్పారు. కొత్త కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!