CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ అలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్…
ఇటీవల మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసళ్లు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్ ఆలం ట్యాంకులో మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాంతం పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.