దోపిడీకి వ్యతిరేకంగా అప్పుడు నిజాం నవాబుని తరిమి కొట్టి ప్రపంచానికి చాటి చెప్పిన గడ్డ వరంగల్ అని కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకే.. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పెట్టనున్నట్లు టీపీసీసీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం వరంగల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు.. రైతుల కోసం పెడుతున్న సభ అన్నారు. సభ విజయవంతం చేసేందుకు ప్రజలే బాధ్యత తీసుకుంటారు.. అని రాహుల్ గాంధీ చెప్పారని, ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కోసం తనువు చాలిస్తున్న కర్షకుల కోసం ఈ సభ అన్నారు. కేసీఆర్ వరి వేసుకుంటే ఉరేసుకున్నట్లే అన్నారని, ప్రత్యామ్నాయ పంటలను పట్టించుకోకపోవడంతోనే రైతుల వరి వైపు మళ్లారన్నారు. గతంలో ఎక్సైజ్ ఆదాయం 10వేల కోట్ల వస్తే.. ఇప్పుడు 36వేల కోట్ల ఆదాయంకి పెరిగిందన్నారు. పబ్.. క్లబ్ ల సంస్కృతి తీసుకొచ్చారు కేసీఆర్.. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా అందులో టీఆర్ఎస్ నేతలు ఉంటున్నారన్నారు.
హైదరాబాద్‌లోని పబ్ లో డ్రగ్స్ తో దొరికిన వారికి టెస్టులు చేయకుండా కేటీఆర్ పని చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. మొన్న వరంగల్‌కి కాల్వ శుంఠ పాపా రావు.. వచ్చాడు.. ఆయన రాకను సుడిగాలి కూడా క్షమించ లేదని, దుర్మార్గుడు.. అయిన కేటీఆర్‌ని ప్రకృతి కూడా క్షమించలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ నాయినా ఢిల్లీ నాయకుల బూట్ల నాకితే.. నువ్వు సినిమా వాళ్ళ సంక నాకుతావ్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ బిల్ వచ్చినప్పుడు.. సభలో నేను ఏం మాట్లాడానో.. బిల్ లో మార్పు కోసం అప్పుడు చెప్పిన విషయం మరిచిపోయావా.. ఉమ్మడి రాజధాని లో ఆదాయం ఉన్నది అని అడిగితే.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ సంస్థలల్లో వాటా వస్తుంది అని అప్పుడే అసెంబ్లీ లో మాట్లాడానన్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నానో ఒక్కసారి తెలుసుకో అని ఆయన అన్నారు.