తెలంగాణలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలపై ఉన్నతాధికారులతో నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పలు సూచనలు చేశారు. ఆ తరువాత విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నక్క ముసలిది అయ్యాకా.. నాన్ వెజ్ బంద్ చేసినట్టు ఉంది కేసీఆర్ మాటలు అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. వంద ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థ యాత్రలకు పోయి.. నీతి కథలు చెప్పింది అంటా. కేసీఆర్ మాటలు కూడా అట్లనే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని.. దిక్కు మాలిన మోడీతో పోల్చుతవా..? మోడీ క్రూరమైన నిర్ణయాలలో అన్నిటికీ కేసీఆర్ ప్రత్యక్ష పాత్ర ఉంది. నోట్ల రద్దు పై.. అసెంబ్లీ లో భట్టి మాట్లాడితే… ప్రధాని నీ అంటావా..? అని అడ్డగోలుగా మాట్లాడింది కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. నరేంద్ర మోడీ వాటలో… కేసీఆర్ కోటా ఎంత అంటూ ఆయన ధ్వజమెత్తారు. పంట భీమా ఇవ్వడు కానీ..రైతు చస్తే రైతు భీమా ఇస్తా అంటారు.. కేసీఆర్..ఎప్పుడైనా…సచ్చే వరకు చూస్తారు.. సచ్చిన తర్వాత పైసలు ఇస్తారు.
మోడీ కి.. కేసీఆర్‌కి వాట లో తేడా తో లొల్లి మొదలైంది. ఆకు రౌడీ..గల్లి రౌడీ మధ్య లొల్లి లాంటిది. గుణాత్మక మార్పు..అంటారు. అసలు నీ గుణమే గుడిచేదిరింది. శ్రీలంక పరిస్థితులు చూసి కెసిఆర్ కి భయం పట్టుకుంది. మోడీ కి…కేసీఆర్‌కి నిజంగా చెడి పోతే…కొత్త కేసులు అవసరం లేదు.. కాంగ్రెస్ పెట్టిన రెండు సీబీఐ కేసులు ఉన్నాయి చార్జి షీట్ వేయకుండా ఎందుకు మోడీ అపుతున్నరు.. దేశ వ్యాప్తంగా అందరి మీద కేసులు పెట్టిన మోడీ… తెలంగాణ వరకు ఎందుకు రావడం లేదు.. కేసీఆర్ మీద మోడీ.. ఈగ వాలకుండా చూస్తున్నారు. మోడీ.. కేసీఆర్‌తోడు దొంగలు. కేసీఆర్ దోచిన దానికి.. మోడీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు.. మోడీ ప్రొటెక్ట్ కి మనీ ఇస్తున్నాడు.. మోడీకి కప్పం కడుతున్నారు కేసీఆర్ అంటూ ఆయన దుయ్యబట్టారు. మూడు రోజుల బీజేపీ కార్యవర్గ సమావేశాలకు కేసీఆర్ … కేసీఆర్ వ్యాపార భాగస్వామ్యులు పెట్టుబడి పెట్టారని, కేసీఆర్ నీ సంతోష పెట్టే మాటలే మోడీ మాట్లాడారని, కేసీఆర్ జాతీయ పార్టీనే కాదు..అంతర్జాతీయ పార్టీ పెట్టు.. చంద్రమండలంలో పార్టీ పెట్టు.. యమలోకం లో కూడా పార్టీ పెట్టు ఎవడు వద్దన్నాడు అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
