Revanth Reddy: వివేక్.. పొంగులేటి పై దాడులు దారుణమన్నారు. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడు అంతటి మంచివాడు.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరగానే రాముడు లాంటి.. వివేక్ రావణాసురుడులాగా కనిపించాడా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వంద ఖాతాలు ఉన్నాయని బీజేపీ గంటలో తేల్చిందన్నారు. పొంగులేటి బంధువు అయినా పాపానికి ఆర్.సురేందర్ రెడ్డి పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారన్నారు. డబ్బులు ఉన్న వాహనంలో కూర్చోపెట్టి ఫోటోలు తీసి.. కేసు పెట్టారు పోలీసులు అని మండిపడ్డారు. సంతోష్ బంధువు.. ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్.. పీయూష్ గోయల్ ఒప్పందం ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. ఏకే గోయల్ ఇంట్లో వందల కోట్లు పట్టు పడ్డాయని అన్నారు. వికాస్ రాజ్ కి మేము వందల కోట్లు ఉన్నాయని ఫోన్ చేస్తే ఎత్తలేదన్నారు. కొమటిరెడ్డి.. నేను.. వంద సార్లు కాల్ చేశాం.. అయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీకి అనుబంధ విభాగం ఈడీ.. ఐటీలు అని తెలిపారు. ప్రసంగాలకు.. జరుగుతున్న తతంగాలకు పొంతనే లేదన్నారు.
Read also: Ramakrishna: విశాఖ నుంచి పాలన కోర్టు ధిక్కరణే..!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కి, బీజేపీ సహకరించి..దాడులు చేస్తుందని ఆరోపించారు. ఏకే గోయల్ ఇంట్లో 300 కోట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం.. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు సహకరిస్తుందన్నారు. కేసీఆర్ ని ఓడిస్తే.. రైతులకు జనవరిలో మరో ఐదు వేల అన్నారు. కేసీఆర్ ఓటుకి రూ.10 వేలు ఎంఎల్ఏ అభ్యర్థులకు పంపారని.. తక్కువ ఇస్తే అభ్యర్థులను నిలదీయండి.. డబ్బులు ఇవ్వకపోతే అంగీ లాగు గుంజుకోవాలని అన్నారు. మోడీ క్రేన్ పెట్టినా కేసీఆర్ లేవడు అని అన్నారు. అధికారంలోక్ వచ్చేది కాంగ్రెస్ అన్నారు. కౌలు రైతులకు కూడా 12 వేలు ఇస్తుంది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఇప్పుడు రైతు బంధు వేయడంతో.. కౌలు రైతులు, కూలీలు, రైతులు నష్టపోతారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కె తెలివి ఉందని అనుకుంటున్నారూ అని తెలిపారు. కేసీఆర్ ఏం వేసినా తీసుకోండి.. అది మన హక్కు అన్నారు. కాంగ్రెస్ రాగానే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తోందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి.. కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదు బీజేపీ అన్నారు. మళ్ళీ గెలిస్తే చర్యలు తీసుకుంటాం అంటే ఎవరు నమ్ముతారని తెలిపారు.
Amit Shah: మత ఘర్షణల రికార్డ్ కాంగ్రెస్ దే.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి..