CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
- ఐఏఎస్ బదిలీలతో సీఎం స్పష్టమైన సందేశం
- పనితీరు ఆధారంగా పోస్టింగ్స్.. రివార్డ్ vs పనిష్మెంట్
- క్షేత్రస్థాయి పనితీరుపై సీఎం అసంతృప్తి
- జనగణన ముందు వ్యూహాత్మకంగా పూర్తి చేసిన మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బదిలీల ద్వారా తన పరిపాలనా శైలిని స్పష్టం చేస్తూ, ‘క్యారెట్ అండ్ స్టిక్’ (Carrot and Stick) విధానాన్ని పక్కాగా అమలు చేశారు. అంటే.. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు (మంచి పోస్టింగ్స్), నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి శిక్ష (లూప్ లైన్ పోస్టింగ్స్) అనే సంకేతాన్ని పంపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అధికారులకు ఒకటే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు: “ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లండి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోండి”. అయితే, కొందరు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలను పట్టించుకోకుండా పాత పద్ధతిలోనే సాగుతున్నారని నివేదికలు అందాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం, ప్రభుత్వం చెప్పినట్లుగా పనితీరు మార్చుకోని అధికారులపై తన పవర్ చూపించారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించి, సమర్థవంతంగా పనిచేస్తున్న కలెక్టర్లను గుర్తించి వారికి సచివాలయంలో కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. “పనిచేసే వారు సచివాలయంలో ఉంటే ప్రభుత్వ విధానాల అమలు వేగంగా జరుగుతుంది” అనేది సీఎం ఆలోచన. అదే సమయంలో, పదే పదే హెచ్చరించినా పనితీరు మెరుగుపరుచుకోని వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తూ ‘పనిష్మెంట్’ తరహా పోస్టింగ్స్ ఇచ్చారు.
ఆదివారం నుండి దేశవ్యాప్తంగా జనగణన (Census) ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర నిబంధనల ప్రకారం జనగణన సమయంలో అధికారులను బదిలీ చేయడం వీలుపడదు. దీనిని ముందుగానే పసిగట్టిన రేవంత్ రెడ్డి, ఆ నిబంధన అమలులోకి రావడానికి కేవలం ఒక రోజు ముందే ఈ భారీ మార్పులు పూర్తి చేశారు. తద్వారా రాబోయే ఏడాది కాలం పాటు జిల్లాల్లో పక్కాగా పనిచేసే యంత్రాంగాన్ని ఆయన సిద్ధం చేసుకున్నట్లయింది.
ఈ బదిలీల ద్వారా ముఖ్యమంత్రి అధికారులందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక పంపారు. కేవలం పదవిలో ఉన్నామని కాలక్షేపం చేస్తే కుదరదని, ప్రతి అధికారి జవాబుదారీగా ఉండాలని నిరూపించారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను లైట్ తీసుకునే వారికి లూప్ లైన్ తప్పదని ఈ బదిలీల ద్వారా తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!