Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సంబంధిత సర్కిళ్ల ద్వారా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అంతకు ముందు ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఈ నేతలిద్దరూ సమావేశమై చర్చిస్తారని, 26న ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం జూపల్లిని కూడా కలవనున్నారు. రాహుల్ గాంధీతో సమావేశం, ఖమ్మం బహిరంగ సభపై వారితో చర్చించనున్నారు. గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లితో తొలుత బీజేపీ నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీ ఢీకొంటుందని అంచనా వేయడంతో ఈటల రాజేందర్‌తో పలుమార్లు చర్చలు జరిపారు.
Read also: Rashmika: ఈ సినిమాతో నార్త్ లో నేషనల్ క్రష్ సెటిల్ అయిపోవాల్సిందే
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
అయితే ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదన్న అభిప్రాయాన్ని అనుచరులు వ్యక్తం చేయడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో పొంగులేటి, జూపల్లిలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించేందుకు ఈ నేతలంతా కలిసి గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదా కలిసి ఒకే పార్టీలో చేరడం వంటి ప్రత్యామ్నాయాలపై నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు. బీజేపీలో కూడా కాంగ్రెస్‌ను వీడిన నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న ప్రచారంపై కూడా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమిస్తారని వార్తలు వచ్చాయి కానీ చివరికి అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీని వీడేది లేదని ఈటల, రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కూడా ప్రచారంలో పాల్గొంటారు.
Somu Veerraju: దమ్ముంటే చర్చలకు రావాలంటూ.. చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!