Revanth Reddy: బంగారు తెలంగాణ కాదు బందీ తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిగిలో మన ఊరు-మన పోరులో పాల్గొన్నారు. తెలంగాణలో 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తలలో బంధించారన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మానిక్ రావ్, దేవేందర్ గౌడ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగాడన్నారు. చేవెళ్లను కొండ పోచమ్మ లో ముంచిండు, చెల్లమ్మను టీఆర్ఎస్ లో కలుపుకున్నాడు.
అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లో కలిసామని అన్న చేవెళ్ల చెల్లమ్మ ఎందుకు చేవెళ్ల అభివృద్ధి కోసం అడగడం లేదు. ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి జిఓ ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టు ను చేవెళ్లను రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా? యాదగిరి గుట్ట లో ప్రమాణం చేసి చెవుతావా కేసీఆర్. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఏ దయ్యం పాలిస్తుంది. పాలమూరు రంగారెడ్డిని కట్టమని కేసీఆర్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. కేసీఆర్ -జగన్ ప్రగతి భవన్ లో అలయ్ బలయ్ చేసుకొని మనల్ని నిండా ముంచిండ్రు. మూడేళ్ళ కిందనే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ ఇలా మా గొంతులు ఎండేవా? ఆంధ్ర వాళ్ళు నీళ్లు, నిధులు దోచుకుపోతున్నారని కేసీఆర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నీళ్లు వస్తాయన్నారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చాక ఇప్పుడు నీళ్లు జగన్ దోచుకుపోయాడు. నియామకాలు కేసీఆర్ ఇంట్లో అయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇప్పుడు దేశానికి ప్రధాని చేయమంటున్నాడు. ఇక దేవుణ్ణి చేస్తే అన్ని పనులు చేస్తారు అనే పరిస్థితి ఉంది. కేసీఆర్ తాగుబోతు మాటలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్, మహిళలు, టీచర్లు, కలెక్టర్ల అవినీతి, నిరుద్యోగులు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ల గురించి మాట్లాడుతున్నారు. రైతుల ధాన్యం కొనమని అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వేసిన వరి కొనేవాడు మన రైతుల వడ్లు కొనాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎవరు కొంటే వాళ్లే కొనాలి. కేసీఆర్ వడ్లు కొనకపోతే కేసీఆర్ ను అమరవీరుల స్థూపం వద్ద ఉరి వేద్దాం అన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!