తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్న అద్భుతమయిన రోజు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. తొమ్మిదవ ఏట అడుగుపెట్టాం. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం చర్చ్ రాం పెడ్ గ్రామంలో రైతు గోస మహా ధర్నా లో పాల్గొన్నారు వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పేదలకు ఇంకా 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చే వారన్నారు. వైఎస్సార్ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. కుర్చీలేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడంటూ రైతు గోస సభలో…
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిగిలో మన ఊరు-మన పోరులో పాల్గొన్నారు. తెలంగాణలో 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తలలో బంధించారన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మానిక్ రావ్, దేవేందర్ గౌడ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగాడన్నారు. చేవెళ్లను కొండ పోచమ్మ లో ముంచిండు, చెల్లమ్మను…