మంచిర్యాలలో జరుగుతున్న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభలో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నామని, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదారాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ పెట్టింది.. కేవలం రానున్న దళితుల ఓట్లు కొల్లగొట్టడం కోసమేనని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే సంకెళ్లు వేసి జైళ్లకు పంపినవ్ అని ఆయన మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎవరు ఎదురుకున్న వారిని ఉపేక్షించేది లేదన్న కేసీఅర్ నీ కొడుకు,,బిడ్డ పైన ఆరోపణలు వస్థే ఎందుకు భర్తరఫ్ చెయ్యలేదని ఆయన ప్రశ్నించారు.
Also Read : Aadhar Card Lost: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె 2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు 500 వందలకే సిలిండర్లను అందిస్తామని ఆయన అన్నారు. ఇసుక మాఫియాకు అడ్డొచ్చారని దళిత యువకులను తొక్కించిన సంగతి మర్చిపోయావా? అని మండిపడ్డారు. అలాగే.. ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలు వేయించిన సంగతీ మర్చిపోయావా? ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయకపోగా.. అన్యాయమే ఎక్కువ జరుగుతోందని అన్నారు. కేటీఆర్, కవితపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు రేవంత్ రెడ్డి.
Also Read : Corona Tension: ఏపీ, తెలంగాణల్లో కరోనా టెన్షన్
