Revanth Reddy : సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ..సోనియా గాంధీకి బీజేపీ నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబంకి అండగా ఉంటామని, సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్య్రం కోసం పెట్టిన పత్రిక అని, దేశ ప్రజల భావోద్వేగం తెలియ జేయాలని పెట్టిన పత్రిక అని, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పోషించింది హెరాల్డ్ పత్రిక అని ఆయన వెల్లడించారు.
బీజేపీ మతం ముసుగులో నడుస్తున్న కుట్రను తిప్పి కొట్టే పనిలో ఉందని, అందుకే బీజేపీకి భయం వేసి.. ఈడీ కేసులు పెడుతుందోన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామితో కేసు వేయించిందని, అప్పట్లో కాంగ్రెస్ అధికారం లో ఉన్నా… విచారణ జరిపించినదన్నారు. 2015 లో ఈడీ హెరాల్డ్ లో తప్పులేం జరగలేదు అని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కానీ అప్పటి కేసును బీజేపీ ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు.
Also Read
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
బీజేపీ దృష్టి మళ్లించే కుట్ర చేస్తుందన్న రేవంత్.. పెరిగిన ధరలతో పేదలను వంచించింది బీజేపీనేనని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికి రాహుల్..సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈడీ పిలవాలి అంటే.. ఎఫ్‌ఐఆర్ నమోదు అవ్వాలని, కానీ ఎఫ్‌ఐఆర్ కూడా లేని కేసులో నోటీసులు ఇప్పించింది బీజేపీ అంటూ ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!