CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
- ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
- ఈ గెలుపునకు ప్రధాన భూమిక పోషించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు
- ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది
- నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నిసార్లు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్‌కు రావడం, గత రెండేళ్ల తమ పాలనపై ప్రజల నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు రావడం, నగర రాజకీయ దిశను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ధోరణి కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో పెద్దగా ఫలితాలు రాలేదని గుర్తుచేసిన సీఎం, ఇప్పుడు ప్రజలు తమ పనితీరును పరిశీలించి తీర్పు ఇచ్చారని చెప్పారు. నగరంలోని అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, అయితే బీఆర్‌ఎస్ మాత్రం తప్పుడు ప్రచారానికి తెగబడుతోందని విమర్శించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నగరాభివృద్ధికి కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్, కబ్జాల నివారణకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల కోసం ప్రారంభించిన ఈ చర్యలపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లు గతంతో పోల్చితే 25 శాతానికి పడిపోవడం “భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనలా” ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సచివాలయానికి రావాలని కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. కేంద్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కకు సూచించారు.
Bhumana Karunakar Reddy: సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..