Revanth Reddy: తెలంగాణ సంపదని కాలగర్భంలో కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Comments On CM KCR In Mulugu District: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లాలో పర్యటిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ వారసత్వ సంపదని కాలగర్భంలో కలిపేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ.. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కోతుల గుంపుకు రాష్ట్రాన్ని అప్పగించినట్లు అయ్యిందని, అత్యంత విలువైన కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదని మండిపడ్డారు. ఆర్కియాలజీ శాఖ నామమాత్రంగా మారిందని, కేసిఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 8 శతాబ్దాల నాటి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.
Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం
Also Read
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
- CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
దేశ భద్రత కూడా ఆందోళనకరంగా తయారైందని.. 2 వేల కి.మీ వరకు చైనా చొచ్చుకు వచ్చినా ప్రధాని మోడీ ఏమీ చేయడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తూ.. ఆర్ధిక వ్యవస్థను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అదే స్పూర్తితో తాము హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టామని, మార్పు కోసమే తాను ఈ యాత్ర మొదలుపెట్టామని స్పష్టం చేశారు. గిరిజన సోదరులు ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రేవంత్.. పాదయాత్రకు సంఘీబావం తెలిపిన కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని, మేసిఫెస్టో విడుదల చేస్తాని స్పష్టం చేశారు. కాగా.. ఈరోజు ములుగు జిల్లాలో యాత్రను ముగించుకొని.. రేపు, ఎల్లుండి వరుసగా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో రేవంత్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు.
Satyavathi Rathod: తెలంగాణపై కేంద్రం విషం కక్కుతోంది.. రేవంత్ నీ పార్టీని కాపాడుకో
తాజావార్తలు
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!