Satyavathi Rathod: తెలంగాణపై కేంద్రం విషం కక్కుతోంది.. రేవంత్ నీ పార్టీని కాపాడుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod Fires On Modi Sarkar Over Girijan Varsity: గిరిజన వర్శిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ ప్రతిపాదన లేదని పార్లమెంట్‌లో మోడీ సర్కార్ చెప్పడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. గతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలనలో ఉందని పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. ఈ యూనివర్శిటీ కోసం ములుగులో రాష్ట్ర ప్రభుత్వం భూమిని సైతం ప్రతిపాదించిందన్నారు. అయినా.. ఇప్పటికీ తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని కేంద్రం ఏర్పాటు చేయలేదని విరుచుకుపడ్డారు. ఈ వర్శిటీ కోసం రాష్ట్ర సర్కార్ పలుమార్లు కేంద్రాన్ని కోరిందని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ పై విషం కక్కుతోందని విమర్శించారు. ఇదే సమయంలో.. రేవంత్ రెడ్డిపై కూడా సత్యవతి ఫైర్ అయ్యారు. రేవంత్‌కి సత్తా ఉంటే కేంద్రంతో కొట్లాడాలని ఛాలెంజ్ చేశారు. సమ్మక్క సారలమ్మ, మేడారం అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కి లేదన్నారు. ములుగును గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నీ పార్టీ పాతాళంలోకి వెళ్లకుండా కాపాడుకోవాలని రేవంత్‌ని సూచించారు. నీతో నడుస్తున్న ఆ నలుగురు కూడా ఎన్నికల దాకా ఉండేలా చూసుకో అని చెప్పారు.
Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కాగా.. తెలంగాణ సర్కార్ సర్కారు బడుల అభివృద్ధికి రూ.7200 కోట్లు మంజూరు చేసిందని ఇటీవల సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తోందని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మన ఊరు-మన బడి మొదటి విడుతలో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశామని తెలిపిన ఆమె.. రానున్న మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు తాగునీటితో పాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్‌ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
Raghunandan Rao: మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ సర్కార్ దాడి చేస్తోంది
తాజావార్తలు
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్‌ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!