Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Rumours: ఈ రోజుల్లో ఏ వార్త ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో చుట్టూ తెగ కథలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటో ఏంటో తెలుసా.. సాంప్రదాయ దుస్తుల్లో మెడలో పూలదండలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న సీనియర్ నటుడు జయరామ్, ప్రముఖ నటి సిమ్రాన్ కలిసి ఉన్న ఫోటో. ఈ ఫోటో బయటికి రావడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వాళ్లిద్దరూ సిక్రెట్గా పెళ్లి చేసుకున్నారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఫొటోలు నిజమైనవే అయినప్పటికీ.. అవి జయరామ్, సిమ్రాన్ పెళ్లికి సంబంధించినవి కావని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించనున్న ఓ కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఫొటోలు తీసినట్లు సమాచారం.
సినిమా పూజా కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన జయరామ్, సిమ్రాన్‌ను నిర్వాహకులు పూలదండలు వేసి సత్కరించారని చెబుతున్నారు. ఆ సమయంలో తీసిన ఈ ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు అంటూ ప్రచారం చేయడంతో సోషల్ మీడియాలో ఈ వాళ్లిద్దరూ సిక్రెట్గా పెళ్లి చేసుకున్నారంటూ గందరగోళం మొదలైంది. నిజానికి ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారని భావించారు. అయితే అసలు విషయం తెలియడంతో వాళ్ల పెళ్లి వార్తలకు చెక్ పడింది. ఇక ఈ కొత్త సినిమ విషయానికొస్తే.. జయరామ్, సిమ్రాన్ దాదాపు 24 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించబోతున్నారు. డైరెక్టర్ ఎస్.వై.గౌతమ్‌రాజ్ తెరకెక్కించనున్న ఈ కొత్త చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడం, ఆ ఫోటోలు జయరామ్, సిమ్రాన్ పెళ్లి ఫోటోలుగా ఉండటం, తర్వాత అసలు విషయం బయటికి రావడంతో.. మూవీకి స్టార్టింగ్‌లోనే సూపర్ పబ్లిసిటీ వచ్చిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?