తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకుంటోంది టాలీవుడ్ డ్రగ్స్ కేసు. ఇందులో భాగంగానే.. మంత్రి కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి మధ్య తారా స్థాయికి మాటల యుద్ధం చేరింది. పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కింది రాజకీయం. ఈ నేపథ్యం లోనే మంత్రి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
ఈ ఛాలెంజ్ లో భాగంగా.. తాను రక్త పరీక్షలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఏ డాక్టర్ వద్దకు రమ్మన్నా తాను వస్తానని… మరీ… కేటీఆర్ మరియు కొండా విశ్వేశ్వర్ రెడ్డి దీనికి సిద్ధమా అని సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసుకు సంబంధం లేకపోతే… మంత్ర కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు రేవంత్. రకుల్ ప్రీత్ సింగ్, హీరో రానాలను డ్రగ్స్ కేసులో ఎవరు కాపాడారని నిలదీశారు.