తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే ప్రగతి సాధ్యమయిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నారాయణ పేట్ కోస్గి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హల్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి TPCCఅధ్యక్షులు , మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 500 మందికి పైబడి సభ్యత్వం చేయించిన నాయకులను ఘనంగా సన్మానించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజక వర్గంలో తన హయాంలో మాత్రమే జరిగిన అభివృద్ధి తప్ప , కొత్తగా అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదని అన్నారు.
నియోజక కేంద్రానికి , మండల కేంద్రాలనుండి డబుల్ రోడ్లు తన హయాంలోనే వేయించానని , కోడంగల్ , కోస్గి పూరపాలికల్లో 50 పడకల ఆసుపత్రులను కూడా తెచ్చింది తానేనని తెలిపారు. నేటికీ వాటి పనులు పూర్తి కాకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై, బహిరంగ చర్చకు ఎక్కడికైనా తాను రావడానికి సిద్దంగా ఉన్నానన్నారు. టీఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు .