Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ ఛాలెంజ్.. తాడోపేడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Again Challenges CM KCR: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌కి సవాల్ విసిరారు. ఏ ఊర్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చావో అక్కడ నువ్వు గెలిపించుకో అని, ఇళ్లు ఇవ్వని చోటా తాము గెలిపించుకుంటామని అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, దళిత బందు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల భూములని ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి, బీఆర్ఎస్ పార్టీలకు చెరో పది సంవత్సరాలు అధికారం ఇచ్చారని.. ఈసారి కాంగ్రెస్‌కి అవకాశం ఇవ్వండని ప్రజల్ని కోరారు. ఐనవోలు మండలం పేరుమాండ్ల గూడెంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో యువకులపై కేసులు పెట్టి, పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు.
Nirmala Sitaraman: కేసీఆర్‌పై నిర్మలా ఫైర్.. జోకులు వద్దంటూ వార్నింగ్
Also Read
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే.. కేసీఆర్‌కి రెండుసార్లు పట్టం కట్టారని రేవంత్ పేర్కొన్నారు. కానీ దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి, డబుల్ బెడ్‌రూం వంటి హామీలిచ్చి మోసం చేశారన్నారు. అన్ని కులాల వారికి కుల వృత్తుల పేరుతో ఉంటే.. కేసీఆర్, ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారని విమర్శించారు. చదువుకున్నా పేదింటి పిల్లలు కూడా కులవృత్తులు చేసుకోవాలా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. అదేం లేదని దాటవేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మొదటగా ధరణి సైట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప.. కేసీఆర్ ఇచ్చిందేమీ లేదని వ్యాఖ్యానించారు. వృధ్యప్య పెన్షన్‌లు కూడా ఇవ్వలేదన్నారు.
Harish Rao: దేశం మార్పు కోసమే కేసీఆర్ పోరాడుతున్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం కూడా రూ.5 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే.. రూ.500 గ్యాస్ సిలెండర్ ఇచ్చే భాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నారు. 2024 కొత్త సంవత్సరం నాడు పోడు భూములుతో పాటు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని మాటిచ్చారు.
Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!