Tension in Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని ఆర్కాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. ఒక దశలో ఆసుపత్రి ఒక గదిలోని అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం జాంగిర్ దర్గా సమీపంలోని ఏనుగుల మడుగు తండాకు చెందిన లక్ష్మణ్ 43 సంవత్సరాలు గత నెల 26వ తేదీన తన ఆటో నడుపుకుంటూ సాతం రాయిలోని హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొని కిందపడి గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం బంధువులు తొలుత శంషాబాద్ లోని లిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత ఇంకా మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పక్కనే ఉన్న ఆర్కాన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు పర్యాయాలు కాలేయ సంబంధమైన శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఈ ఆస్పత్రిలోనే ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు మంగళవారం ఉదయం చికిత్స పొందుతున్న లక్ష్మణ్ మృతి చెందాడు. లక్ష్మణ్ కు భార్య ఒక సంతానం ఉన్నారు. ఈ విషయం తెలిసినా మృతుల బంధువులు వైద్యం సరిగా చేయనందువల్లే లక్ష్మణ్ మృతి చెందాడని నిరసిస్తూ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఒక దశలో వైద్యులకు బంధువులకు గొడవ జరిగి ఆసుపత్రిలో ఒక గది అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్జిఐ శంషాబాద్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని పరిశీలిస్తున్న ఆసుపత్రి మేనేజ్మెంట్ పై ఫిర్యాదు చేస్తున్నట్లు మృతుడి బంధువులు తెలిపారు.
Munugode Assembly constituency : మునుగోడులో ఓట్లు బంగారం కాసులు కురిపించనున్నాయా?