Sunitha Laxma Reddy: తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీసుకి రేఖా శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై మహిళా కమిషన్ దృష్టిపెడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జాతీయ ఛైర్ పర్సన్ రేఖా శర్మ విచ్చేశారు. మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి లీగల్ సెల్, అందుబాటులో వాట్సాప్ నెంబర్ వుందన్నారు. మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి లీగల్ సెల్ ను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే న్యాయ సహాయ కేంద్రం లక్ష్యమని జాతీయ చైర్మన్ రేఖా శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిషన్ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ సెల్ మహిళల హక్కులను పరిరక్షించడంపై దృష్టి సారించడం, వారికి చట్టపరమైన సలహాలు, సహాయం కోసం వన్-స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుందని మహిళలు ఎక్కడికీ వెళ్లకుండా న్యాయ సహాయం పొందగలుగుతారని చైర్‌పర్సన్ తెలిపారు.
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
Presidential Election 2022: ముగిసిన పోలింగ్.. 99.18% ఓటింగ్ నమోదు
వాక్-ఇన్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ అందించడంతో పాటు ఆపదలో ఉన్న మహిళలకు న్యాయ సహాయం, సలహాలు మరియు వివిధ పథకాలపై సమాచారం అందిస్తుందని జాతీయ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతికి మరియు రాష్ట్ర మహిళా కమిషన్, చట్టాలపై మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు, మానవ అక్రమ రవాణపై చేస్తున్న కార్యక్రమాల గురించి జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ కు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు చెరువుగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మహిళా కమిషన్ కి వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణాకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని చైర్ పర్సన్ తెలియజేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో ఏ.హచ్. టి.యు లు ఏర్పాటు చేసిందని అలాగే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పిల్లలు, మహిళలపై సైబర్ నేరాలు, ఆన్ లైన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంటీ హ్యూమన్ ట్రాఫకింగ్ యూనిట్స్, షీ సైబర్ సెల్ ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఒడిషా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం మరియు ట్రాఫికింగ్ లో గుర్తించిన వారికోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో పోలీస్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ కలిసి ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం నాడు రాష్ట్రంలో అన్ని ఐసీడీస్ ప్రాజెక్టులలో స్వరక్ష డే నిర్వహించడం జరుగుతుందని చైర్ పర్సన్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరిక్టేందుకు అంతర్ రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని చైర్ పర్సన్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మకు తెలియజేశారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!