Heavy Rains : తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రమంతటా వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రాబోయే రెండు గంటలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జి్లలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Read Also : Hens Death : పౌల్ట్రీఫాంలోకి వరద నీరు.. 10వేల కోళ్లు మృతి
రాబోయే రెండు గంటలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నాయి. వాగులు, వంకలు భారీగా పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో మనుషులు గల్లంతు అవుతున్నారు. వీలైనంత వరకు వాగుల వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రోడ్లు మునిగిన ప్రాంతాల్లో ఎవరూ వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. రాబోయే 24 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also : Floods : వరదల్లో చిక్కుకున్న 12 మంది.. సాయం కోసం ఎదురుచూపు..