Red alert: తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్.. వరద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red alert: తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోతున్నాయి. అయితే రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు గురువారం రాత్రి వాతావరణ బులెటిన్ విడుదల చేసి హెచ్చరికలు జారీ చేసింది.
Read also: Shriya Saran : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న శ్రీయ
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
నేడు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపటి నుంచి 25వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొమరం భీం జిల్లా బిజ్జూరులో 257.4, జంగం జిల్లా జఫర్‌గఢ్‌లో 174.2, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో 133, మెదక్‌లో 131.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే జనగాం జిల్లాలో 88.4, మెదక్ జిల్లాలో 131.2, కొమరం భీం జిల్లాలో 69.1, మహబూబాబాద్ జిల్లాలో 66.6, సిద్దిపేట జిల్లాలో 66.1, మహబూబ్ నగర్ జిల్లాలో 1.7, నల్గొండలో 6.2 మి.మీ. మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 21.5 మి.మీ, రామగుండం జిల్లాలో 63.5 మి.మీ. హైదరాబాద్‌లో 43.3, ఖమ్మంలో 11.2, హనుమకొండలో 43.0, దుండిగల్‌లో 68.7, హకీంపేటలో 47.8, భద్రాచలంలో 92.4, ఆదిలాబాద్‌లో 14.0 మి.మీ.
Muslim Population: దేశంలో పెరిగిన ముస్లింల జనాభా.. లోక్ సభలో గణాంకాల వెల్లడి
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!