Shankarpally Robbery: శంకర్‌పల్లిలో దారి దోపిడీ.. రూ. 40 లక్షలతో పారిపోతుండగా కారు బోల్తా!
- శంకర్‌పల్లిలో పట్టపగలే దారి దోపిడీ..
- స్టీల్ వ్యాపారిని బెదిరించ రూ. 40 లక్షలు చోరీ..
- రూ. 40 లక్షలతో పారిపోతుండగా దుండగుల కారు బోల్తా..
- ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankarpally Robbery: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామం దగ్గర పట్ట పగలే దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తున్న స్టీల్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఏకంగా 40 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జనతా స్టీల్ షాప్ నుంచి రూ.40 లక్షల నగదు తీసుకుని వస్తున్న వ్యాపారుల కారు కదలికలను ముందుగానే గమనించిన నలుగురు దుండగులు మరో కారులో ఫాలో అయ్యారు.
Read Also: 1973 Plane Hijacking: నేపాల్ ప్రధాని రేసులో సుశీలా కర్కీ.. ఈమె భర్త విమానం హైజాక్ చేశాడని తెలుసా..?
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్‌తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
అయితే, శంకర్పల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామం సమీపంలో అదును చూసుకున్న దుండగులు ఒక్కసారిగా స్టీల్ వ్యాపారి కారును ఢీకొట్టి, కారు అద్దాలు ధ్వంసం చేసి కత్తులు, బొమ్మ తుపాకీతో బెదిరించారు. ఇక, కారులో ఉన్న నగదు బ్యాగును బలవంతంగా లాక్కుని తమ వాహనంలో పారిపోతున్న క్రమంలో దుండగుల వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సందర్భంగా రూ.8 లక్షల నగదు బ్యాగును అక్కడే వదిలి పెట్టి, మిగతా డబ్బుతో దుండగులు జంప్ అయ్యారు. ముందుగానే మరో కారును బ్యాకప్‌గా ఉంచుకున్న వారు కొంతదూరం పరిగెత్తి ఆ వాహనంలో ఎక్కి అక్కడి నుంచి పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పారిపోయిన దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!