పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని, అవసరం అయితే జైలుకు పంపిస్తాం అని కార్యకర్తలతో అన్నారు. కొందరు తాము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వంను అస్సలు చంపుకోవద్దని సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు.…
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు 9 మంది కొత్త అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ బుధవారం నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.