Ramchander Rao : పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చారని, మీ పార్టీ ముఖ్యమంత్రి కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు…