Natti Kumar : నటుడు ఫిష్ వెంకట్ రీసెంట్ గా కిడ్నీల సమస్యతో చనిపోయాడు. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి ఎవరైనా సాయం చేయాలని ఆయన కుటుంబం వేడుకుంది. హీరోలు సాయం చేస్తారేమో అని చాలా మంది ఆశించారు. కానీ ఎవరూ సాయం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెద్ద నటులు, డైరెక్టర్లకు ఏదైనా అయితే అందరూ వస్తారు. కానీ వెంకట్ చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాకపోవడంపై కొంత వ్యతిరేతక వచ్చింది. దానిపై తాజాగా నిర్మాత, డైరెక్టర్ నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిష్ వెంకట్ చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. సినిమాల్లోనూ నటించట్లేదు.
Read Also : Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
అందుకే ఆయనకు ఎవరూ టచ్ లో లేరు. సినిమా రంగం చాలా బిజీ. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలకు క్షణం కూడా తీరిక ఉండదు. టచ్ లో ఉంటే కచ్చితంగా వెళ్లేవారు. కానీ వెంకట్ అలా టచ్ లో లేరు. అందుకే ఎవరూ వెళ్లలేదు. వెంకట్ కు సాయం చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో అన్నారు. కానీ ఆయన టాలీవుడ్ లో మెంబర్ షిప్ కూడా తీసుకోలేదు. ఇక్కడ ఎవరి బతుకులు వారివి. కచ్చితంగా హీరోలు సాయం చేయాలని రూల్ లేదు. అయినా వెంకట్ గారు రోజుకు0 రూ.3వేల నుంచి రూ.30వేల దాకా తీసుకునే స్థాయికి ఎదిగారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుండేది. అనవసరంగా డబ్బు వృథా చేసుకోవద్దు. నేను మాట్లాడేది ఫిష్ వెంకట్ కుటుంబానికి బాధగా ఉండొచ్చు. కానీ రేపు నేను చనిపోయినా ఇంతే. నేను ఎవరితో టచ్ లో ఉంటే వారే నా ఇంటికి వస్తారు అంటూ చెప్పుకొచ్చాడు నట్టి కుమార్.
Read Also : Sukumar : సుకుమార్ లెక్కలను ఫాలో అవుతున్న డైరెక్టర్లు..!