Site icon NTV Telugu

HYDRA : రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు.. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ వివాదం

Hydra

Hydra

HYDRA : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Authority) కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హైడ్రాకు అందిన ఫిర్యాదులో, హైదర్ గూడలోని పార్క్‌కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టారని తెలిపారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో JCBలతో సైట్లోకి చేరుకున్నారు.

Floods: నేపాల్-చైనా బోర్డర్‌లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు

కూల్చివేతల ప్రక్రియ మొదలైన వెంటనే స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అడ్డుకుంటూ కొందరు మహిళలు నేరుగా వాహనాల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రభుత్వంగా జారీ అయిన పట్టాలు ఉన్నాయని, ఆ భూముల్లో తామే అసలు యజమానులమని బాధితులు వాదించారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం, సర్వే నంబర్ 16లో ఉన్న భూమి పార్క్‌కు కేటాయించబడిందని, అందులో ప్రహరీ నిర్మాణం అక్రమమని పేర్కొన్నారు. వాస్తవిక పరిశీలన అనంతరం ఆ నిర్మాణాన్ని కూల్చేశారు.

అయితే, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవన కూల్చివేతలు జరపడం అన్యాయమని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద పరిస్థితుల దృష్ట్యా, పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నా, పట్టాదారులు న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..

Exit mobile version