HYDRA : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Authority) కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హైడ్రాకు అందిన ఫిర్యాదులో, హైదర్ గూడలోని పార్క్‌కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం…