Rajanna Sircilla: బరితెగించిన కాంట్రాక్టర్.. కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని తీసుకెళ్లి నిర్బంధం..
- కొడుకు పైసలు ఇయ్యలేదని తల్లిని తీసుకెళ్లిన కాంట్రాక్టర్..
- కొద్దిరోజులగా మహారాష్ట్ర కాంట్రాక్టర్- కొడుముంజ మేస్త్రీకి మధ్య డబ్బుల పంచాయితీ..
- మేస్త్రీ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగిన మహారాష్ట్ర వ్యక్తులు..
- అనారోగ్యంతో ఉన్న తల్లిని బలవంతంగా తమతో తీసుకెళ్లిన వైనం..
- కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్య క్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీను అనే వ్యక్తి బండ పని మేస్త్రీగా పనిచే స్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన లాలు దేవకర్ అండ్ టీం కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనులను కాంట్రాక్టు తీసుకున్నారు. ఇందుకోసం కూలీలు అవసరం ఉండగా.. శ్రీను. అతడి సోద రుడిని సంప్రదించారు. ప్రస్తుతం శ్రీను, అతని సోదరుడు చత్తీస్ గఢ్ లో కూలీ పనులు చేస్తున్నారు. అయితే లాలు దేవకర్ కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన లేబర్ లను పురమాయించేందుకు చత్తీస్ గఢ్ కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు. దీనికి మధ్య వర్తిత్వంగా శ్రీను వ్యవహరించాడు. ఇందుకోసం లాలు దేవకర్ రూ.3.80 లక్షలను కూలీలకు చెల్లించాడు.
Read also: Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాం..
Also Read
కానీ కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవకర్ కు, కొడుముంజకు చెందిన శ్రీను, అతడి సోదరునికి మధ్య వివాదం చోటుచేసుకుంది. తన డబ్బులు తిరిగి చెల్లించాల ని లాలు దేవకర్ శ్రీను అతడి సోదరుడిపై ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం లాలు దేవకర్, మరికొంత మంది కొడుముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని శ్రీను ఇంటికి వచ్చారు. శ్రీను.. అతడి సోదరుడు ఇంటి వద్ద లేకపోవడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న శ్రీను తల్లి అయిన పల్లపు భీమా బాయ్ ను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ కు పాల్పడ్డారు. డబ్బులిచ్చి తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లాలు దేవకర్ అతని అనుచరు లు దౌర్జన్యంగా భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీర ప్రసాద్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. పల్లపు భీమా బాయ్ ను ఎత్తుకెళ్లిన వారు మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం సేకరించి పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?