Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pavala Shyamala: తెలుగు రంగస్థల, సినీ నటి పావలా శ్యామల 74 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె మరణం సినీ, నాటక రంగాల్లో విషాదాన్ని నింపింది. శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు, ఆవిడ గురించి చాలా మందికి తెలియని నిజాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న శ్యామల, కేవలం 13 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది సంవత్సరాలకే భర్త ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను భుజాన వేసుకుని నటననే జీవనాధారంగా ఎంచుకున్నారు.
రంగస్థలంపై ఆమె నటనా ప్రస్థానం ‘దొంగాటకం’ నాటకంతో ప్రారంభమైంది. అనంతరం ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రచించిన ‘పావలా’ నాటకంలో ఆమె నటనకు అపారమైన ప్రశంసలు లభించాయి. ఆ నాటకంలోని పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన శ్యామలను ప్రేక్షకులు ప్రేమగా ‘పావలా శ్యామల’ అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరు తర్వాత ఆమె ఇంటి పేరుగానే స్థిరపడిపోయింది. రంగస్థలంపై తన హావభావాలు, సహజమైన సంభాషణలు, పాత్రలో పూర్తిగా లీనమయ్యే నటనతో పావలా శ్యామల ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. నాటకరంగంలో ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1985లో జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, అనంతరం స్వర్ణకమలం, ఖడ్గం, ఆంధ్రావాలా, వర్షం తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే జీవిత చరమాంకంలో అవకాశాలు తగ్గిపోవడం, అనారోగ్య సమస్యలు వెంటాడడంతో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పలువురు ప్రముఖులు ఆమెకు చేయూత అందించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. రంగస్థలంపై ‘పావలా’గా చిరస్థాయిగా నిలిచిపోయిన నేతి శ్యామల… తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ ‘పావలా శ్యామల’గానే గుర్తుండిపోతారు.
Also Read
- Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
- Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
తాజావార్తలు
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!