Rainbow Meadows : సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటలో రెయిన్‌బో మెడోస్ నిర్మాణ సంస్థ పాల్పడిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ మోసం తాజాగా వెలుగు చూసింది. హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌గా నమ్మించి, పలు సర్వే నంబర్లలో ఏకంగా 40 విల్లాలను అక్రమంగా నిర్మించి అమాయక ప్రజలకు విక్రయించారు. ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విల్లాలన్నీ సర్వే నంబర్లు 198, 199, 204, 208, 210లలోని ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం…