యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ ‘రామసేతు’లోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర చేస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’. రీసెంట్‌గా ఆ సినిమా నుంచి రిలీజైన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇన్‌టెన్స్ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. గురువారం ‘కృష్ణమ్మ’ టీజర్‌ను హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘కృష్ణమ్మ’ టీజర్ 1 నిమిషం 19 సెకన్లు ఉంది. ఇందులో సినిమా ఎంత ఇన్‌టెన్స్‌గా, రస్టిక్‌గా ఉండనుందనే విషయాన్ని రివీల్ చేశారు. టీజర్‌లో సత్యదేవ్ వాయిస్ ఓవర్‌తో కథను వివరించాడు. ‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని టీజర్‌లో చూపించారు.
ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ చిన్న ఘటన వారి ముగ్గురి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనేదే కథ. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్, టీజర్‌లో చూపించిన సత్యదేవ్ ఆవేశం సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. సత్యదేవ్ ను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో చూడాలనుకుంటున్న అతని అభిమానుల కోరిక ఈ మూవీతో తీరే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వి. వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.