Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆకస్మికంగా బదిలీ చేశారు ఉన్నతాధికారులు.. చంద్రశేఖర్ ఆజాద్‌ను.. శ్రీకాళహస్తికి ఆకస్మికంగా బదిలీ చేశారు.. గత కొంతకాలంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈవో ఆజాద్‌పై ఆరోపణలు ఉన్నాయి.. గత నెలలోనే పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు.. ఆజాద్ కు మంత్రి కొట్టు సత్యనారాయణ ఆశీస్సులు ఉన్నాయని చెబుతుంటారు.. కానీ, వివాదాస్పద నిర్ణయాలే ఆయన బదిలీకి కారణం అంటున్నారు.. మరోవైపు.. 2017లో ఆజాద్ పై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి.. కేసులు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పదోన్నత కల్పించారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారిపోయాయి.. ఉద్యోగులు , ఆలయం సమీపంలో పనిచేసే ప్రతి ఒక్కరూ.. కార్తీక మాసంలో కచ్చితంగా సత్య దీక్షలు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రశేఖర్ ఆజాద్.. అయితే, దీనిపై కొందరు ఉద్యోగులు, సిబ్బంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినట్టు సమాచారం.. ఇక, చంద్రశేఖర్ ఆజాద్‌ను అన్నవరం నుంచి శ్రీకాళహస్తికి ఆకస్మికంగా బదిలీ చేయడంతో.. అన్నవరం దేవస్థానం ఈవోగా రామచంద్ర మోహన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
Read Also: CWC 2023 India Final: భారత్ ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా!