Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు (ఈ నెల 17న) రాష్ట్రానికి రానున్న ఆయన ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుఫాన్ పర్యటన చేయనున్నారు. రాహుల్ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటల…