NTV Telugu Site icon

Raghunandan Rao: ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయ్‌

Raghunandan Rao

Raghunandan Rao

సిద్దిపేట రూరల్ మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. మండలంలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని ర‌ఘునంద‌న్ రావు ఎద్దేవా చేశారు. గ‌డిచిన ఎనిదేళ్ల‌లో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్ర‌శ్నించారు.

డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? అంటూ మండిప‌డ్డారు. సీసీ రోడ్లు ఎన్ని? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి స‌మాదానం పరిపాలించే నాయకులే చెప్పాలి’ అంటూ విమ‌ర్శించారు. తెలంగాణ‌ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురవేయడం ఖాయమని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చిత్త శుద్ధి ఉంటే బచ్చాయిపల్లికి వెంటనే డబుల్ బెడ్రూం ఇవ్వాలని ర‌ఘ‌నంద‌న్ రావు డిమాండ్ చేశారు. బ‌చ్చాయి ప్ర‌జ‌ల‌ గుండెల్లో కాషాయం జెండా ఎప్ప‌టికి వుంటుందని అన్నారు. మీ బొమ్మ‌లు ఫ్లెక్సీలలో మాత్రమే ఉంటాయ‌ని టీఆర్ఎస్‌నుద్దేశించి రఘునందన్ ఎద్దేవ చేశారు.

నిర్బంధాల మధ్య దిన పత్రికలు నడిపిన చీకటి రోజులని పేర్కొన్నారు. 21 నెలల ఎమర్జెన్సీని పారద్రోలి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని తెలిపారు. నాటి నిర్బంధం ఎలా ఉందో ఈ రోజు తెలంగాణలో అదే పరిస్థితి ఉందని మండిప‌డ్డారు. కాగా ఓ గిరిజనురాలిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటివరకూ కేసీఆర్ నోరు మెదపలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే.. ఇందిరాగాంధీ ఎలాగైతే ప్రజామ్యం గొంతు నులిమి, నియంత పాలన సాగించాలని కోరుకుందో.. ఇవాళ‌ రాష్ట్రంలో అదే పరిస్థితి నెల‌కొంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణలో నేడు నిర్బంధాలు, ఒత్తిళ్లు, పోలీస్ పాలన తప్ప మరేమీ లేదని మండి ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికి, పోరాటాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు. సీఎం త‌న‌ కుటుంబ పాలన కొన‌సాగించాలనే దుర్మార్గపు ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారని నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఇంకా ఎంతో కాలం కొనసాగదని రఘునందన్ హెచ్చ‌రించారు.

TRS :టీఆర్ఎస్ నేతల రాజకీయ ఎత్తుగడలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న జడ్పీ చైర్ పర్సన్