చైన్ స్నాచింగ్.. హైదరాబాద్ నగర్ లో ఈ మాట చాలా కాలం నుంచి వినపడట్లేదు.. ఎప్పుడైతే పీడీ యాక్ట్ నమోదు చేసి చైన్ స్నాచింగ్ ను కటకటాల వెనక్కి నెట్టుతున్నారో.. అప్పటినుంచి హైదరాబాదులో చైన్ స్నాచింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. గత ఆరు సంవత్సరాల కాలం నుంచి స్నాచింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పుడప్పుడు అడపా దడపా స్నాచింగ్ లు జరుగుతున్నప్పటికీ నిందితుల్ని పట్టుకుంటున్నారు. గత ఆరు సంవత్సరాల నుంచి స్నాచింగ్ లను పూర్తిగా పోలీసులు కంట్రోల్ లోకి తెచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉండే స్నాచర్స్ నగరంపై కన్నేసి మహిళల మంగళసూత్రాన్ని తెంపుకొని పోతున్నారు అయితే అలాంటి వారిని వెతికి వెంటాడి పోలీస్ అధికారులు కటకటాల వెనక్కి నెట్టివేశారు.
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టించింది. అయితే ఎప్పుడైనా సరే హైదరాబాద్ నగరంలో మొదలుపెట్టి రాచకొండ లేదా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరకు చోరీలు చేసి అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ ఈసారి తెలివిగా శివార్ ప్రాంతం నుంచి స్యాచింగ్ చేసుకుంటూ హైదరాబాద్ నగరం లోపలి వరకు వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో చైన్ స్నాచర్ల హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాదులో రెండు మూడు రోజులపాటు తమకు అనుకూలమైన ప్రాంతంలో రెక్కీ చేస్తారు. చోరీలు చేసిన తర్వాత ఈజీగా పారిపోయే రూట్లను వీళ్లు ఎంచుకుంటారు. అంతేకాకుండా హైదరాబాదులోని ఏదో ఒక ప్రాంతంలో టూవీలర్ వాహనాన్ని చోరీ చేస్తారు. చోరీ చేసిన టు వీలర్ మీదనే చైన్ స్టాచ్యులకు పాల్పడుతుంటారు రైలు, విమానాలు ,బస్సు రూట్లో ఒక చోట్ల ఎక్కి పారిపోతారు.
Kilauea Volcano Erupt: కిలాయుయా అగ్నిపర్వతం బద్ధలు..
మెరుపు వేగంతో చైన్ స్నాచింగ్ చేసి అంతే విధంగా పారిపోతారు. పోలీసులు తేరుకొనిలోపే వీళ్ళు హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అవుతారు. అయితే మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ , పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఉండే కరడు గట్టిన నేరగాళ్లు హైదరాబాద్ కు వచ్చి దొంగతనాలు చేసి పారిపోతుంటారు. ఇలాంటి గ్యాంగులను ఇప్పుడు వరకు 20 కి పైగా పోలీసులు అరెస్టు చేసి పిడి యాక్టులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు .ఇటీవల కాలంలో పిడి నుండి కొందరు నెరగాళ్లు బయటపడ్డారు. అలాంటి నేరగాల్లే ఇప్పుడు మరొకసారి హైదరాబాదులోని జంట నగరాల పైన మళ్లీ కన్ను వేశారు. . ఈసారి చైన్ చైన్ స్నాచింగ్ పోలీసులకు కొత్త తరహాలో షాక్ ఇచ్చారు. ఎప్పుడు కూడా చైన్ స్నాచింగ్ హైదరాబాదులో స్నాచింగ్లు చేసుకుంటూ చివరకు శివారు ప్రాంతాలకు చేరుకుంటారు. అక్కడ తమ టూ వీలర్ వదిలేసి హైవేలు రైల్వే రూట్లలో పారిపోతారు.
కానీ ఈసారి చైన్ స్నాచింగ్ హైదరాబాద్ శివారులో టార్గెట్ చేసుకొని సిటీ సెంటర్ లోకి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి నార్త్ ఇండియాకు పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరకు కాజీపేట సమీపంలోని పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకోగలిగారు.. స్నాచర్లు ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం సమయంలోనే దొంగతనాలకు పాల్పడుతుంటారు. మార్నింగ్ వాకర్స్ ని టార్గెట్ చేసుకొని స్నాచింగ్ చేస్తుంటారు. లేదంటే సాయంత్రం సమయంలో ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలని టార్గెట్ చేసి మంగళసూత్రాన్ని తెంపుకొని పారిపోతుంటారు.
అయితే ఈసారి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఉప్పల్ లో మొదటి స్నాచింగ్ చేశారు. ఉప్పల్ ప్రాంతంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న మహిళను టార్గెట్ చేసుకొని స్నాచింగ్కు చేశారు. ఆ తర్వాత వరుసగా ఉప్పల్ ఉప్పల్ ,కళ్యాణపురి, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ ,చిలకలుగూడ ,రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ వరకు వరుసగా 6 చైన్ స్నాచింగ్ లు చేసుకుంటూ వచ్చారు. రాంగోపాల్పేట పరిధిలో తమ టు వీలర్ ని వదిలేసి అక్కడి నుంచి ఆటోలో కాచిగూడ చేరుకున్నారు. కాచిగూడలోని నార్త్ ఇండియా కి వెళ్తున్న ట్రైన్ లో బయలుదేరి వెళ్లిపోయారు. నార్త్ ఇండియాకి చెందిన గ్యాంగ్ లు చోరీకి పాల్పడ్డాయని హైదరాబాద్ రాచకొండ పోలీసులు భావించారు. చైన్ స్నాచింగ్ ని పట్టుకోడానికి 10 బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాదులో స్నాచింగ్ జరిగిన ప్రాంతాలన్నిటిని విచారణ మొదలు పెట్టారు. మొత్తం చోరీ జరిగిన ప్రతి చోట సీసీ కెమెరాలు స్వాధీన పంచుకున్నారు . ఇందులో ఇద్దరు పాత నేరస్తులు చోరీ చేసినట్లుగా గుర్తించారు. ఈమెరకు వాళ్ల స్వస్థలాలకు పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు .ఈ సమయంలోనే కాజీపేట ప్రాంతంలో ఇద్దరినీ పట్టుకోవడం జరిగిందని రాచకొండ సీపీ చౌహాన్ వివరించారు.
Read Also: Kilauea Volcano Erupt: కిలాయుయా అగ్నిపర్వతం బద్ధలు..