హైదరాబాద్ హైటెక్ నగరమే కాదు డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగానికి అడ్డాగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. తాజాగా బంజారాహిల్స్ లో రాడిసన్ హోటల్లోని ఫుడిండ్ అండ్ మింక్ పబ్ లో ప్రముఖుల పిల్లలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో దొరికిపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ పబ్ లో డ్రగ్స్ గబ్బు రేపుతున్నాయి. ఇప్పటివరకూ పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతుందని వినడమే ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు మత్తుగాళ్లు.
మొన్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తొలి మరణం సంభవించగా.. నేడు పబ్లో రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ దొరికిన వైనం కలకలం రేపుతోంది. అందరినీ నివ్వెరపరుస్తోంది. డ్రగ్స్ బానిసలుగా మారిన బడాబాబుల పిల్లలు సమాజానికి సవాల్ విసురుతున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వినియోగం తాజా సంస్కృతికి అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేసేంతవరకు కళ్లు తెరవని బంజారాహిల్స్ పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఐదుగురు యువతీ యువకులు వున్నారు. పోలీసుల రంగప్రవేశంతో కిటికీ నుంచి డ్రగ్స్ విసిరేశారు యువతీ యువకులు. పోలీసుల అదుపులో ప్రముఖ నటుడి కుమార్తె వుందని అంటున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు పబ్ యజమానులను పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కి తీసుకొని వచ్చారు పోలీసులు.
పబ్ లో డ్రగ్స్ దొరకడంతో ఇద్దరు యాజమానులను తీసుకొని వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరి యాజమానులను పబ్ లోపలికి తీసుకొని వెళ్ళారు పోలీసులు. డ్రగ్స్ దొరికిన ప్రాంతాలని చెక్ చేస్తున్నారు పోలీసులు. పోలీసులు రావడంతో డ్రగ్స్ ను పబ్ లోపల పడవేశారు యువతి యువకులు. పబ్ లోపల ప్రాంతాలను అన్నిటిని చెక్ చేస్తున్నారు పోలీసులు.