PM MODI: హైదరాబాదులో అడుగు పెట్టిన ప్రధాని.. పాలమూరుకు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 01:05 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. అయితే ప్రధాని మధ్యాహ్నం 01:30 గంటలకు వస్తారని సమాచారం అందింది. అయితే ప్రధాని మోదీ మధ్యాహ్నం 01:40 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:47 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు.
ప్రధాని మహబూబ్ నగర్ శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా రూ. 13,500 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే బీజేపీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పాలమూరు నుంచే ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నిన్న మోడీ తెలంగాణ పర్యటనపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. ఇవాళ మహబూబ్ నగర్ లో జరగనున్న సభలో ప్రధాని మోదీ ఎలాంటి విమర్శలు చేస్తారోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాల వాటాపై కేంద్రం లెక్కలు వేస్తోందని బీఆర్ఎస్ సర్కార్ విమర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ మరోసారి దూరంగా ఉన్నారు. ప్రధాని మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
Telangana Govt: అంగన్‌వాడీలకు దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా..
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గలకు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!