తిరునామం, పట్టువస్త్రాలతో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో అతి పెద్ద విగ్రహం ఇది.

కాగా రామానుజుల బంగారు విగ్రహానికి నిత్యపూజలు జరిగేలా చిన్నజీయర్ స్వామి ఏర్పాట్లు చేశారు. విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించేలా లైటింగ్ పెట్టారు. మొత్తం 216 అడుగుల్లో రామానుజ విగ్రహం 108 అడుగుల కాగా… పద్మపీఠం 27 అడుగులు. రామానుజ విగ్రహం దిగువన భద్రవేదిక 54 అడుగులు ఉంటుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!