Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
- బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు
- ప్రియుడికి పోలీసులు షాక్
- భారీ జరిమానాతో ఝలక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమికుల మధ్య ఉండే సంబంధాన్ని అమ్మాయి-అబ్బాయిలు బహుమతుల ద్వారా వ్యక్తపరుచుకుంటారు. ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడంతో ప్రేమను తెలియజేసుకుంటారు. అయితే అందరిలా చేస్తే స్పెషల్ ఏముంటుందని అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. ఓ ప్రేమికురాలు.. తన ప్రియుడిపై ఉన్న ప్రేమను వెరైటీగా వ్యక్తం చేసింది. కానీ ఖాకీలు మాత్రం బిగ్ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ ప్రియురాలు వెరైటీగా ప్రేమను వ్యక్తం చేయాలను కుంది. అంతే ఆదిత్యకు చెందిన మారుతి స్విఫ్ట్ కారుపై లిప్‌స్టిక్‌తో ముద్దుల గుర్తులు వేసింది. ఇలా కారు నిండా ఏకంగా 3,400 ముద్దులు వేసింది. దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు కష్టపడి కారు మొత్తం లిప్‌స్టిక్ ముద్దులతో నింపింది. సుమారు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు కారుపై వేసింది. ఇంతటితో బాగానే ఉంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఏకంగా 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో జంట కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే ఈ వీడియో చివరకు ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలించిన పోలీసులు.. లిప్‌స్టిక్ గుర్తులతో నిండిన కారును గుర్తించే ప్రయత్నం చేశారు. నగర రోడ్లపై తిరుగుతున్న దృశ్యాలతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ అభిషేక్ రఘువంశీ నేతృత్వంలో పోలీసులు వాహనం ఆచూకీని గుర్తించారు. చివరకు గ్వాలియర్‌లోని తాతీపూర్ ప్రాంతంలో కారును గుర్తించారు. వాహనాన్ని మార్పులు చేసిన నిబంధనల కింద మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ప్రియుడు ఆదిత్యకు రూ.5,500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో జోకులు..
ఈ ఘటనకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఈ కారుకు వచ్చిన ముద్దులు చాలా మంది మనుషులకు జీవితాంతం కూడా దక్కవని కామెంట్లు చేశారు. మరికొందరు ఇంతగా కారు రంగు మారితే కొత్త రంగుగా రవాణా శాఖలో నమోదు చేయాలా? అంటూ సరదాగా ప్రశ్నించారు. ఇంకొందరు మాత్రం సోషల్ మీడియా లైక్స్ కోసం చేసిన రొమాంటిక్ ప్రయత్నానికి చివరకు జరిమానా చెల్లించాల్సి వచ్చిందని ఆదిత్యపై సానుభూతి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!